చెత్త కోసం నూతనంగా తోపుడుబండ్లు ఏర్పాటు

చెత్త కోసం నూతనంగా తోపుడుబండ్లు ఏర్పాటు

NDL: సిరివెళ్ల మండలం కామినేనిపల్లి గ్రామంలో శనివారం గ్రామ సర్పంచ్ నరసింహ రెడ్డి చెత్త కోసం నూతనంగా తోపుడు బండ్లను ఏర్పాటు చేశారు. గ్రామంలో తడి చెత్త, పొడి చెత్త కోసం వేర్వేరుగా తోపుడుబండ్లను ఏర్పాటు చేసినట్లు గ్రామ సర్పంచ్ నర్సింహారెడ్డి తెలిపారు. గ్రామ ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తోపుడు బండ్లలో మాత్రమే వేయాలని ఆయన ప్రజలను కోరారు.