సింగూర్ రిజర్వాయర్‌కు 20,136 క్యూసెక్కుల వరద

SRD: విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో పుల్కల్ మండలం సింగూరు రిజర్వాయర్‌లోకి భారీ వరద చేరుతోంది. శనివారం ఉదయం 6 గంటల వరకు 20,136 క్యూసెక్కులు వరద వచ్చినట్లు AE స్టాలిన్ తెలిపారు. అదేవిధంగా మూడు క్రస్ట్ గేట్ల ద్వారా 22,138 క్యూసెక్కులు ఔట్ ఫ్లో కొనసాగుతున్నదని చెప్పారు. ఇవాళ కూడా నదిలోకి చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.