వివిధ ప్రాంతాల్లో కమిషనర్ సుడిగాలి పర్యటన
VZM: నగరంలో వివిధ ప్రాంతాల్లో విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య బుధవారం సుడిగాలి పర్యటనలు చేశారు. పలు చోట్ల జరుగుతున్న పారిశుధ్య విధానాన్ని గమనించారు. వర్షపు నీరు ఎక్కడా నిల్వ లేకుండా చూడాలని సిబ్బందికి ఆదేశించారు. అనంతరం అన్న క్యాంటీన్లో అందిస్తున్న ఆహారం గూర్చి ఆరా తీశారు. క్యాంటీన్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశించారు.