VIDEO: కర్రతో దాడి.. భార్య మృతి
SRD: అమీన్ పూర్ మున్సిపల్ వడకపల్లి గ్రామ శివారులో లంబాడ దంపతుల మధ్య చెలరేగిన గొడవ ప్రాణాలు తీసింది. కోపంతో భర్త బానోత్ రాజు(46) భార్య సరోజ(42)పై కర్రతో దాడి చేయగా, ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. జీవనోపాధి కోసం బీరంగూడ వచ్చి పౌల్ట్రీ ఫారంలో కూలీలుగా పనిచేస్తున్నారు. దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. శనివారం బాధితుల ఫిర్యాదుతో నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.