'యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి'

'యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి'

SKLM: యువత డ్రగ్స్ బారిన పడి జీవితం నాశనం చేసుకోవద్దని భావనపాడు కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీనివాసరావు అన్నారు. సోమవారం వజ్రపుకొత్తూరు మండలం ఒంకులూరు ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డ్రగ్స్ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ రహిత సమాజానికి అందరం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.