ఆ గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం

SRPT: మోతె మండలం సిరికొండ, రావిపాడు గ్రామాల మధ్యగల వాగు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గురువారం ఉప్పొంగి రోడ్డుపై నీరు ప్రవహిస్తుంది. దీంతో ఆ గ్రామాలకు వెళ్లే వాహనదారులకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉధృతి తగ్గేంతవరకు వాగు దాటే ప్రయత్నం చేయొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.