విరిగి పడ్డ చెట్టు కొమ్మలు.. తప్పిన ప్రమాదం

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా మాయ బజార్ వీధిలో చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి. ఈ సంఘటనతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదృష్టవశాత్తు, కొమ్మలు విరిగిపడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అధికారులు వెంటనే స్పందించి చెట్టుకొమ్మలను తొలగించే పనులు చేపట్టారు.