నీటి కుంటలో పడి వ్యక్తి మృతి

MLG: జిల్లా మంగపేట మండలం బ్రాహ్మణపల్లిలో శనివారం ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి గారా అంజన్న (54) మృతి చెందాడు. గణేష్ నిమజ్జనానికి బంధువుల ఇంటికి వచ్చిన అంజన్న నీటి కుంటలో పడి మరణించాడు. మృతుడు వాజేడు మండలం ధర్మారం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది.