నిధులు దుర్వినియోగం.. కార్యదర్శులపై వేటు
PPM: కొమరాడలో సచివాలయంలో విధులు నిర్వహించిన నలుగురు కార్యదర్శులపై సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినట్లు ఎంపీడీవో రమేశ్ తెలిపారు. గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగం జరిగాయి అన్న అభియోగంపై గతంలో పనిచేసిన కార్యదర్శులు శ్రీనివాసరావు, వైకుంఠరావు, గణపతితోపాటు ప్రస్తుత కార్యదర్శి నాగరాజును కూడా సస్పెండ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.