బయట గంజాయి కొనలేక.. పెరట్లోనే పెంపకం
NGKL: అచ్చంపేట మండలం పల్కపల్లిలో నాగనూలు మధు పెరట్లోనే గంజాయి మొక్కలు సాగు చేశాడు. అచ్చంపేట రెండో ఎస్సై సుధీర్‌కుమార్ గురువారం తనిఖీలు నిర్వహించి 20 గంజాయి మొక్కలను గుర్తించాడు. అనంతరం సీఐ నాగరాజు, ఎస్సై సద్దాంలకు సమాచారం అందించి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.