ఇళ్లలోకి చేరిన వరద నీరు
RR: హయత్ నగర్ లోని లక్ష్మీప్రియ కాలనీలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద నీరు ఇళ్లలోకి చేరింది. కాలనీ ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిలోని కాలువలను కొంతమంది కబ్జాదారులు మూసివేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై స్థానిక కార్పొరేటర్ జీవన్ రెడ్డి ఫిర్యాదు చేయగా, జీహెచ్ఎంసీ సిబ్బంది కాలువ తవ్వి నీటిని తొలగించారు.