'మంత్రి పొంగులేటి పర్యటనను అడ్డుకుంటాం'

BDK: లంబాడీ సామాజిక వర్గానికి మంత్రి పదవి కేటాయించని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టనున్నట్లు సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు సురేష్ నాయక్ అన్నారు. నేటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. లంబాడీల ఓట్లతో ఎమ్మెల్యేలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.