VIDEO: "వెంటనే సరిపడా యూరియా పంపిణీ చేయాలి"

VIDEO: "వెంటనే సరిపడా యూరియా పంపిణీ చేయాలి"

BHPL: చిట్యాల మండలం వెంకట్రావుపల్లిలోని గ్రోమోర్ ఎరువుల కేంద్రం వద్ద సోమవారం యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం నుంచి క్యూలో నిలబడిన రైతులకు కేవలం ఒక్క యూరియా బస్తా మాత్రమే అందుతోందని, స్టాక్ ఉందని అధికారులు చెప్పిన సరిపడా ఎందుకు పంపిణీ చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిపడా యూరియా పంపిణీ కోసం అధికారులు తక్షణం స్పందించాలని కోరుతున్నారు.