బాన్సువాడకు చేరుకున్న అయ్యప్ప స్వాములు

బాన్సువాడకు చేరుకున్న అయ్యప్ప స్వాములు

NZB: బాన్సువాడ నుంచి శబరిమల పాదయాత్ర వెళ్లి తిరిగి వచ్చిన అయ్యప్ప దీక్ష స్వాములకు బుధవారం రాత్రి ఘన స్వాగతం లభించింది. 42 రోజుల క్రితం బాన్సువాడ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మీదుగా కేరళకు చేరుకుని అయ్యప్పను దర్శనం చేసుకుంది. ఈ యాత్రలో 1,600 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి అయ్యప్పతో అద్భుతమైన ఆనందం పొందామన్నారు.