వ్యవసాయ సహకార ఛైర్మన్‌గా వెంకటరెడ్డి

వ్యవసాయ సహకార ఛైర్మన్‌గా వెంకటరెడ్డి

NDL: మిడుతూరు మండలంలోని పీరు సాహెబ్ పేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఛైర్మన్‌గా వెంకటరెడ్డి మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంఛార్జ్ మాండ్ర శివానంద రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందించాలన్నారు. అవకాశం ఇచ్చిన శివానంద రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.