చంద్రబాబు పాలన చేనేతలకు స్వర్ణ యుగం: మంత్రి

AP: సీఎం చంద్రబాబు పాలన చేనేతలకు స్వర్ణయుగం లాంటిదని మంత్రి సవిత తెలిపారు. చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్‌లు పెడుతున్నామని వెల్లడించారు. 90 శాతం సబ్సిడీతో ఫ్రేమ్స్, ఇతర పరికరాలు అందిస్తామని తెలిపారు. ఎమ్మిగనూరులో టెక్స్‌టైల్స్ పార్క్‌ను అభివృద్ధి చేసి త్వరలోనే సీఎం చేతులమీదుగా ప్రారంభిస్తామని పేర్కొన్నారు.