'తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి'

'తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి'

ASR: వేసవి సెలవులకు ఇళ్లకు వచ్చిన పిల్లల పట్ల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కొయ్యూరు సీఐ బీ.శ్రీనివాసరావు సూచించారు. ఆదివారం మంప ఎస్సై సీదరి శ్రీనివాస్‌తో కలిసి రాజేంద్రపాలెం వారపు సంతను సందర్శించారు. సంతకు వచ్చిన ప్రజలతో సమావేశం నిర్వహించారు. పిల్లలు, జలపాతాలు, నీటిప్రవాహాల వద్దకు వెళ్లకుండా చూడాలన్నారు. అలాగే పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.