DMHO పరిపాలనా అధికారిగా బాధ్యతలు చేపట్టిన సురేష్
కృష్ణా: మచిలీపట్నంలోని DMHO కార్యాలయంలో పరిపాలనా అధికారి కే. సురేష్ గురువారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కే. సురేష్ మాట్లాడుతూ.. శాఖ పనితీరు మరింత పారదర్శకంగా, వేగవంతంగా కొనసాగించే దిశగా కృషి చేస్తానని తెలిపారు. ఆరోగ్యశాఖలో ప్రజా సేవలకు ప్రాధాన్యం ఇస్తూ, అన్ని కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్తానని పేర్కొన్నారు.