ఆటోను ఢీ కొట్టిన టిప్పర్ లారీ

BDK: చుంచుపల్లి మండలం అంబేద్కర్ నగర్ పెనగడప గ్రామ పంచాయతీలో సోమవారం రాత్రి ఆటోను టిప్పర్ లారీ ఢీ కొట్టిందని స్థానికులు తెలిపారు. ఆటో డ్రైవర్ శేషగిరికి తీవ్ర గాయాలతో ఉండగా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణం టిప్పర్ లారీ ఓవర్ స్పీడ్ అని పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.