అనుమానాస్పద స్దితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్దితిలో వ్యక్తి మృతి

PPM: సాలూరు మండలం పసుపువానివలసలో గురువారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రూరల్‌ SI రవీంద్ర రాజు వివరాల ప్రకారం.. బొర్రపణుకువలస గ్రామానికి చెందిన చిక్కుడు సరుబు ఒడిశాలోని సుంకి వెళ్లి తిరిగివచ్చే క్రమంలో పసుపువానివలస కాజువే వద్ద పడిపోయాడు. స్థానికులు మృతుడి కుమారుడికి సమాచారం అందించగా అతడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.