రాములు నాయక్ సేవలు ప్రజలు మరువలేరు

రాములు నాయక్ సేవలు ప్రజలు మరువలేరు

NLG: ప్రభుత్వ వైద్యుడిగా రాములు నాయక్ పేద ప్రజలకు చేసిన వైద్య సేవలను ఈ ప్రాంత ప్రజలు ఎన్నటికీ మరువలేరని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. దేవరకొండకు చెందిన సీనియర్ వైద్యుడు ఎన్. రాములు నాయక్ ఇటీవల మృతి చెందగా బుధవారం సంతాపసభ జరిగింది. ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌తో కలిసి ఎమ్మెల్యే రాములు నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.