ఆచారి నగర్‌లో పేదల స్థలాలు పెద్దలపాలు

ఆచారి నగర్‌లో పేదల స్థలాలు పెద్దలపాలు

KDP: కడప నగర శివారులోని ఆచారి నగర్‌లో పేదలకు కేటాయించిన స్థలాలను ధనవంతులు ఆక్రమించుకున్నారని RCP రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆ ప్రాంతాన్ని సందర్శించి, పుట్లంపల్లి చెరువులో ఇళ్ల స్థలాలు ఇవ్వడం వల్ల అవి ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. అధికారుల సహకారంతో కొందరు వ్యక్తులు 3-4 స్థలాలను ఆక్రమించుకున్నారన్నారు.