'ఎన్నికల కోడ్ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు'

విశాఖ: అనంతగిరి మండలంలో గల పోలీస్ స్టేషన్‌లో వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలతో, సోమవారం ఎస్సై కరక రాము ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ... జూన్ 4న నిర్వహించే ఎన్నికల కౌంటింగ్‌లో కోడ్ నిబంధనలను అతిక్రమించి ఎటువంటి సంబరాలు నిర్వహించిన, ప్రలోభాలకు, ఇతర ఘర్షణలకు, పాల్పడిన వారి పైన కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.