పులిచింతలకు భారీ వరద.. 15 గేట్లు ఎత్తిన అధికారులు

PLD: నాగార్జునసాగర్ నుంచి పులిచింతలకు భారీ వరద వస్తూ ఉండటంతో లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. గురువారం 15 గేట్లు ఎత్తి ప్రకాశం బ్యారేజ్‌కి వరద నీటిని విడుదల చేస్తున్నారు. వరద నీరు తాకిడికి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురీ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు.