కర్నూలు SP స్పందనకు 95 ఫిర్యాదులు

కర్నూలు SP స్పందనకు 95 ఫిర్యాదులు

కర్నూలులో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 95 ఫిర్యాదులు స్వీకరించినట్టు ఎస్పీ విక్రాంత్ తెలిపారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుపై త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజలను ప్రత్యక్షంగా కలసి సమస్యలను తెలుసుకున్న ఎస్పీ, పోలీసు అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.