ఫుట్ పాత్ ఆక్రమణలు.. పట్టించుకోని అధికారులు

ఫుట్ పాత్ ఆక్రమణలు.. పట్టించుకోని అధికారులు

సిద్దిపేటలో ఫుట్‌పాత్‌ను కొందరు వ్యాపారులు ఆక్రమించుకుంటున్నారు. మెదక్, హైదరాబాద్, కరీంనగర్ ప్రధాన రోడ్ల పక్కన కట్టిన ఫుట్‌పాత్‌లను వ్యాపార సముదాయాలుగా మార్చేశారు. నడకదారులు ప్రశ్నిస్తే పైగా దబాయిస్తున్నారు. అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.