ప్రకాశం బ్యారేజ్ 69 గేట్లు ఎత్తివేత

ప్రకాశం బ్యారేజ్ 69 గేట్లు ఎత్తివేత

AP: విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్‌కి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 4.38 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా.. అధికారులు 69 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. దీంతో నదీ తీరప్రాంతాల్లో చేపల వేటను నిషేధించిన అధికారులు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.