ఒక్కరోజే 20మె.ట యూరియా పంపిణీ: ఏవో

WGL: నల్లబెల్లి మండల కేంద్రమైన పీఏసీఎస్ ద్వారా సోమవారం ఒక్కరోజే 20 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేసినట్టు మండల వ్యవసాయ అధికారి రజిత తెలిపారు. యూరియా అవసరం ఉన్న రైతులు తమ ఆధార్ కార్డుతో పాటు వ్యవసాయ భూమికి సంబంధించిన పాస్ పుస్తకాలను కూడా వెంట తీసుకొని రావాలని సూచించారు. నల్లబెల్లితో పాటు శనిగారం ఆగ్రోస్‌లో కూడా యూరియా లభిస్తుందన్నారు.