కన్నుల పండువగా సీతారాముల పల్లకి సేవ

కన్నుల పండువగా సీతారాముల పల్లకి సేవ

MDK: హవేలి ఘనపూర్ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి శ్రీ సీతారాముల పల్లకిసేవ వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను పూలతో అలంకరించిన పల్లకిలో ఊరేగించారు. డప్పు చప్పుళ్లు, భాజాభజంత్రీలు, డీజే పాటలు, ప్రత్యేక విద్యుత్ దీపాలతో పురవీధులు రామ నామంతో మారుమ్రోగింది. భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.