అంబేద్కర్‌కు నివాళులర్పించిన కలెక్టర్
TPT: డా. బీ.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇవాళ తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు.