మత్స్యకారులకు ముమ్మరంగా రేషన్ పంపిణీ
SKLM: శ్రీకాకుళం నియోజకవర్గం రూరల్ మండలం కుందువానిపేట మత్స్యకార కుటుంబాలకు రేషన్ బియాన్ని మంగళవారం SKLM రూరల్ మండలం మాజీ ఎంపీపీ జగపతి అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని అందరికీ అందజేయాలని అధికారులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, సచివాలయాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.