ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు
MLG: గోవిందరావుపేట మండలం పస్రా సమీపంలో గుండ్లవాగు దగ్గర మూలమలుపు వద్ద జాతీయ రహదారి 163 పై ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా ఏటూరునాగారం మండలం చెల్పాకకు చెందిన వారని స్థానికులు గుర్తించారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.