రూ. 14 వేల 539 కోట్లతో పట్టణ అభివృద్ధికి బాటలు: ఎమ్మెల్యే
నెల్లూరు: రాష్ట్ర బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా కోసం కూటమి ప్రభుత్వం రూ. 14 వేల 539 కోట్లు కేటాయించి పట్టణాభివృద్ధికి బాటలు వేసిందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు.