భారత్‌లోనే యాపిల్‌ ఐఫోన్‌ 17 మోడళ్ల తయారీ

భారత్‌లోనే యాపిల్‌ ఐఫోన్‌ 17 మోడళ్ల తయారీ

త్వరలో విడుదల చేసే ఐఫోన్ 17 మోడళ్లన్నింటినీ దేశంలోనే తయారు చేయాలని యాపిల్ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ మోడళ్లను ఐదు ప్లాంట్లలో ఉత్పత్తి చేయనుంది. తమిళనాడు హోసూర్‌లోని టాటా ప్లాంట్‌తో పాటు బెంగళూరు విమానాశ్రయం సమీపంలోని ఫాక్స్ కాన్ యూనిట్లలో వీటిని తయారు చేయనుంది. చైనా మీద ఆధారపడటం, అమెరికాకు ఎగుమతులపై టారిఫ్ రిస్క్‌లను తగ్గించటానికి ఈ నిర్ణయం తీసుకుంది.