సర్వాయి పాపన్న గౌడ్ ఒక గొప్ప యోధుడు: మల్లన్న
BHNG: రాజాపేట గ్రామంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమంలో MLC తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. ఈసందర్భంగా పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మల్లన్న మాట్లాడుతూ.. సర్వాయి పాపన్న గౌడ్ ఒక గొప్ప యోధుడు, ప్రజల హక్కుల కోసం పోరాడిన మహానుభావుడని కొనియాడారు. ఆయన కలలు కన్న సమాన సమాజం సాధన కోసమే TRP పార్టీ కృషి చేస్తోందని తెలిపారు