విశాఖలో కార్మిక శాఖ మంత్రి పర్యటన
VSP: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. రేపు విజయవాడ నుంచి విశాఖ చేరుకొని, పలు కర్మాగారాలను సందర్శించి కార్మికుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం రాత్రికి విశాఖలోనే బస చేస్తారు. ఈ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.