మేయర్ పదవికి స్రవంతి రాజీనామా
నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు శనివారం రాత్రి ప్రకటించారు. తన రాజీనామా లేఖను జిల్లా కలెక్టర్‌కు అందజేస్తానని తెలిపారు. ఈనెల 18వ తేదీన నగరపాలక సంస్థలో మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ఉండగా, దానికి ముందే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మేయర్ తన ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ప్రకటన చేశారు.