మత్స్యకారులకు నిత్యావసరాలు పంపిణీ
VSP: గంగవరం పల్లిపాలెంలో కూటమి ప్రభుత్వం పేదలకు రేషన్ పంపిణీ చేసింది. ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ కరణం రెడ్డి నరసింగరావు, టీడీపీ నాయకులు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. మొంథా తుఫాన్ కారణంగా చేపల వేటకు వెళ్లలేని మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం, కందిపప్పు, ఉల్లిపాయలు, నూనె తదితర వస్తువులు పంపిణీ చేశారు.