VIDEO: రోజుకు 20 కి.మీ మేర పెద్దపులి సంచారం
నిజామాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. రోజుకు 20 కి.మీ మేర సంచరిస్తున్న పెద్దపులి మూడు జిల్లాల అటవీ సరిహద్దుల్లో హడల్ పుట్టిస్తుంది. ఇటీవల భీంగల్‌లోని దేవక్కపేట అడవుల్లో రెండు ఆవులను చంపి తిన్నది. పులి మనుషులపై దాడి చేసే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తాజాగా జగిత్యాలలోని దమ్మాయిపేటలోకి పెద్దపులి ప్రవేశించినట్లు తెలుస్తుంది.