పెంటపాడులో పోషణ పక్వాడ పోస్టర్ ఆవిష్కరణ
W.G: తల్లిదండ్రులు తమ మూడేళ్ల లోపు చిన్నారులను విధిగా అంగన్వాడీ కేంద్రానికి పంపించాలని తహశీల్దార్ ఎం.సునీల్ కుమార్ సూచించారు. సోమవారం పెంటపాడు మండల మహిళా సమాఖ్య భవనంలో పోషణ పక్వాడ పోస్టర్ ఆవిష్కరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో చెప్పే విద్యను చిన్నారులకు అందించాలన్నారు. తద్వారా సులభతరంగా పూర్వ ప్రాథమిక విద్య లభిస్తుందన్నారు.