కారు ఢీకొని భార్యభర్తలకు గాయాలు
NZB: ఎడపల్లి మండలం పోచారం గ్రామ సమీపంలోని బషీర్ ఫారం వద్ద ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. జమలం గ్రామానికి చెందిన గంగామణి, లక్ష్మణ్ వ్యవసాయ కూలీ పనికి నిజామాబాద్ వెళ్తుండగా గుర్తుతెలియని కారు వారి బైక్‌ను ఢీకొట్టింది. 108 సిబ్బంది గంగామణి, అనిల్ ప్రథమ చికిత్స అందించి బాధితులను నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.