ఆధార్ కేంద్రాలను గుర్తించండం ఎలా?
ఆధార్ కేంద్రం ఎక్కడుందో ఇప్పుడు సులువుగా తెలుసుకోవచ్చు. అందుకోసం భువన్ ఆధార్ పోర్టల్‌కు వెళ్లాలి. ఎడమ వైపున నాలుగు డ్రాప్-డౌన్ ఆప్షన్లు కనిపిస్తాయి. దగ్గరలోని కేంద్రాన్ని తెలుసుకునేందుకు ఆప్షన్లలో సెంటర్స్ నియర్‌బైని ఎంపిక చేసుకుంటే సమీపంలో ఉండే కేంద్రాలు కనిపిస్తాయి. టూల్స్ అనే సెక్షన్‌పై క్లిక్ చేసి దగ్గర్లోని కేంద్రానికి మార్గాన్ని కూడా చూసుకోవచ్చు.