మద్యం అనుకొని పురుగుమందు తాగి వ్యక్తి మృతి

మద్యం అనుకొని పురుగుమందు తాగి వ్యక్తి మృతి

CTR: మద్యం అనుకొని పురుగు మందు తాగి వ్యక్తి మృతి చెందిన ఘటన బంగారుపాలెంలో జరిగింది. ఈచనేరిపల్లెకు చెందిన సురేంద్రబాబు(37) ఫుల్‌గా మద్యం తాగి ఆ మత్తులోనే మామిడి తోటకు వెళ్లాడు. అక్కడ ఉన్న పురుగు మందును మద్యం మత్తులో తాగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు.