'నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థులు ఖర్చు చేయాలి'

'నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థులు ఖర్చు చేయాలి'

SRPT: ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పోటీలో ఉన్న అభ్యర్థులు వ్యవహరించాలని కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ అన్నారు. సోమవారం మధ్యాహ్నం చిలుకూరు రైతు వేదికలో మండల వ్యాప్తంగా పోటీలో ఉన్న సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికల నియమావళిపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో నియమావళిపై ప్రతి ఒక్కరూ ప్రతి అభ్యర్థి అవగాహనతో ఉండాలన్నారు.