నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి: YSRTUC
W.G: ఉచిత బస్ పథకం ప్రవేశపెట్టడంతో నష్టపోయిన ఆటో డ్రైవర్లను అన్ని రకాలుగా ఆదుకోవాలని YSRTUC జోన్ 2 జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, జోన్ ఇన్‌ఛార్జ్ అజయ్ కుమార్ అన్నారు. రాయలంలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కమిటీ సభ్యుల సదస్సులో వారు మాట్లాడారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడం కార్మిక వర్గానికి పేద ప్రజలకు తీరని లోటన్నారు.