కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యేల రాజీనామాకు కేటీఆర్ సవాల్

GDWL: పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉపఎన్నికలకు సిద్ధం కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. శనివారం గద్వాల గర్జన సభలో మాట్లాడిన కేటీఆర్ స్వార్థం కోసం పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.