VIDEO: అమరలింగేశ్వర స్వామి బిలంలో భక్తుల రద్దీ
PLD: కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇవాళ గురజాల మండలం దైద గ్రామంలో కొలువైన శ్రీ అమరలింగేశ్వర స్వామి బిలానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో నిలబడి స్వామి వారిని దర్శించుకున్నారు. "ఓం నమశ్శివాయ" నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.