ఎస్సైపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి బీఆర్ఎస్ ఫిర్యాదు
WNP: జిల్లా పానల్ ఎస్సైపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల బీఆర్ఎస్ నాయకులు ఎస్పీ రావుల గిరిధర్‌కు ఫిర్యాదు చేశారు. పానల్ మండలం తెల్లరాళ్లపల్లి తండాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు బాబు నాయక్, ఆయన కుటుంబ సభ్యులపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడినా, ఎస్సై కేసు నమోదు చేయకుండా అలసత్వం వహించారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.