రూ.60 లక్షలతో గ్రీన్ బెల్ట్ ఏర్పాటు

రూ.60 లక్షలతో గ్రీన్ బెల్ట్ ఏర్పాటు

ప్రకాశం: ఒంగోలు నగరంలోని రామ్ నగర్లో 60 లక్షల రూపాయలతో గ్రీన్ బెల్ట్ ఏర్పాటుకు సోమవారం ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పచ్చదనం, పరిశుభ్రతతోనే ప్రజారోగ్యం ఫరిడవిల్లుతోందని చెప్పారు. ప్రతి ఒక్కరూ చెట్లు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర కమీషనర్ కే వెంకటేశ్వరరావు, మేయర్ సుజాత పాల్గొన్నారు.