'చేసింది గోరంత.. ప్రచారం కోండంత'

'చేసింది గోరంత.. ప్రచారం కోండంత'

VZM: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో హామీలు విషయంలో అమలు చేసింది గోరంత.. చేస్తున్న ప్రచారం కొండంతలా ఉందని బొబ్బిలి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌ఛార్జ్‌ మువ్వల శ్రీనివాస రావు అన్నారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమాన్ని నిర్వహించడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.